Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 60

Story of Trisanku - 3 !!

|| om tat sat ||

బాలకాండ
అరువది సర్గము

తపోబలహతాన్ కృత్వా వాసిష్టాన్ స మహోదయాన్ |
ఋషిమధ్యే మహాతేజా విశ్వామిత్రోsభ్యభాషత ||

స|| వాసిష్ఠాన్ మహోదయాన్ సహ తపోబల హతాన్ కృత్వా మహాతేజః విశ్వామిత్రః ఋషిమధ్యే అభ్యభాషత ||

తా|| మహోదయునితో సహా వసిష్ఠపుత్రులను తపోబలముతో హతము చేసిన తరువాత ఆ ఋషులమధ్యలో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను.

అయం ఇక్ష్వాకు దాయాదః త్రిశంకురితి విశ్రుతః |
ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణాగతః ||

స|| అయం ఇక్ష్వాకు దాయాదః ధర్మిష్ఠః వదాన్యః చ | త్రిశంకుః ఇతి విశ్రుతః | (సః) మాం ఏవ శరణాగతః చ||

తా|| ఇతడు ఇక్ష్వాకు కులము వాడు. ధర్మముపాటించువాడు. దానములను చేయువాడు. త్రిశంకుడను పేరు గలవాడు. నా శరణు కోరి వచ్చినవాడు.

తేనానేన శరీరేణ దేవలోక జిగీషయా |
యథాయం స్వ శరీరేణ స్వర్గలోకమ్ గమిష్యసి||
తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవిద్భిశ్ఛ మయా సహ ||

స|| అనేన శరీరేణ దేవలోక జిగీషయా తేన ( మాం శరణాగతః) | మయా సహ భవద్భిః యథా అయం స్వశరీరేనస్వర్గలోకం గమిష్యసి తథా యజ్ఞః ప్రవర్త్యతాం ||

తా|| ఈ శరీరముతో దేవలోకమునకు పోవు కోరికగలవాడు. నాతోకూడి మీరు అందరూ ఇతడు తన శరీరముతో స్వర్గము పోవు విధముగా యజ్ఞము చేయుదము.

విశ్వామిత్రః వచశ్రుత్వా సర్వ ఏవ మహర్షయః |
ఊచుస్సమేత్య సహితా ధర్మజ్ఞా ధర్మసంహితమ్||
అయం కుశిక దాయాదో మునిః పరమ కోపనః ||
యదాహ వచనం సమ్యక్ ఏతత్కార్యం న సంశయః |
అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః ||
తస్మాత్ ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివమ్ |
గచ్చేత్ ఇక్ష్వాకు దాయాదో విశ్వామిత్రస్య తేజసా ||
తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్ఠతః ||

స|| విశ్వామిత్రః వచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః ధర్మజ్ఞః సమేత్య ధర్మసంహితం ఊచుః | అయమ్ మునిః కుశిక దాయదః పరమ కోపినః || భగవాన్ అగ్ని కల్పః | రోషితః శాపం దాస్యతి న సంశయః | ఏతత్కార్యం యదాహ వచనం సమ్యక్ ||| తస్మాత్ యథా విశ్వామిత్రస్య తేజసా ఇక్ష్వాకు దాయాదః స శరీరం దివం గచ్ఛేత్ తథా యజ్ఞః ప్రవర్త్యతామ్ | సమధితిష్ఠతః సర్వే ప్రవర్త్యతామ్||

తా|| విశ్వామిత్రుని వచనములను విని ధర్మజ్ఞులు ఇట్లు పలికిరి. "కుశిక వంశజుడైన ఈ ముని పరమ కోపిష్టి. ఆయన అగ్ని తో సమానమైన వాడు. కోపమువచ్చిన చో సంశయములేకుండా శాపము ఇచ్చును. ఈ కార్యము ఆయన వచనములప్రకారము చేయుటయే మంచిది.
అందుకని విశ్వామిత్రుని యొక్క తేజస్సుతో ఈ ఇక్ష్వాకు వంశజుడు శరీరముతో దేవలోకము వెళ్ళునట్లు యజ్ఞము చేయుదము. అందరూ సిద్ధము కండు".

ఏవముక్త్వా మహర్షయః చక్రుస్తాస్తాః క్రియాస్తదా |
యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రోsభవత్ క్రతౌ ||

స|| మహర్షయః ఏవం ఉక్త్వా తాః తాః క్రియాః తదా చక్రుః |విశ్వామిత్రః చ క్రతౌ యాజకః అభవత్ ||

తా|| మహర్షులు ఈ విధముగా చెప్పి తమతమ పనులు చేయసాగిరి. విశ్వామిత్రుడు క్రతువు యొక్క యాజకుడు అయ్యెను.

ఋత్విజాస్త్వానుపూర్వేణ మంత్రవన్మంత్ర కోవిదాః |
చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిథి ||

స|| ఋత్విజాః మంత్రకోవిదాః మంత్రవన్ సర్వాణి కర్మాణి యథాకల్పం యథావిథిః అనుపూర్వేణ చక్రుః ||

తా|| ఆఋత్విజులు మంత్ర కోవిదులు. మంత్రములతో అన్ని కర్మలను యథావిథిగా కల్పములను అనుసరించి చేసిరి.

తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః ||
చకార ఆవాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః |
నాభ్యాగమం స్తదాహూతా భాగార్థంసర్వదేవతాః ||

స|| తతః విశ్వామిత్రః మహాతపాః మహతా కాలేన సర్వదేవతాః భాగార్థం ఆవాహనం చకార | సర్వదేవతాః తదా భాగార్థం ఆహుతా న అభ్యాగమం ||

తా|| అప్పుడు చాలాకాలము తరువాత మహాతపోవంతుడైన విశ్వామిత్రుడు దేవతలందరినీ వారి హవిర్భాగము తీసుకొనుటకు ఆవాహనమిచ్చెను. దేవతలందరూ వారి హవిర్భాగములు తీసుకొనుటకు రాలేదు.

తతః క్రోథ సమావిష్ఠో విశ్వామిత్రో మహామునిః |
స్రువ ముద్యమ్య సక్రోథః త్రిశంకుం ఇదమబ్రవీత్ ||

స|| తతఃవిశ్వామిత్రం మహామునిః స్రువ ముద్యమ్య క్రోథ సమావిష్ఠో త్రిశంకుం సక్రోధం ఇదం అబ్రవీత్ ||

తా|| అప్పుడు మహాముని యగు విశ్వామిత్రుడు కోపముతో తన స్రువమును పైకెత్తి త్రిశంకుని తో దేవతలమీద మిక్కిలి కోపముతో ఇట్లనెను

పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర |
ఏష త్వాం స శరీరేణ నయామి స్వర్గమోజసా||

స|| హే నరేశ్వరా | మే స్వార్జితస్య వీర్యం తపసం పశ్య| త్వాం ఏష ఔజసా శరీరేణ స్వర్గం నయామి |

తా|| ఓ రాజా! నేను ఆర్జించిన తప శ్శక్తిని చూడుము. నిన్ను ఈ శక్తితో సరీరముతో సహా స్వర్గము పంపించెదను.

దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప |
స్వార్జితం కించిదప్యస్తి మయాహి తపసః ఫలమ్ ||
రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ ||

స|| హే నరాధిప ! దుష్ప్రాపం దివం స శరీరేణ గచ్ఛ | రాజన్ ! మయాహి స్వార్జితం తపసః ఫలమ్ కించిదపి అస్తి తస్య స్వతేజసా స శరీరో దివం వ్రజ |

తా|| ఓ నరాధిప దుష్కరమైన స్వర్గమునకు శరీరముతో వెళ్ళుము. ఓ రాజా ! నేను సంపాదించిన తపోఫలము కొంచెము ఉన్ననూ నీ శరీరముతో దేవలోకమును పోందెదవు.

ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సశరీరో నరేశ్వరః |
దివం జగామ్ కాకుత్‍స్థ మునీనాం పశ్యతామ్ తదా||

స|| మునౌ ఉక్తవాక్యే తదా కాకుత్‍స్థ నరేశ్వరః మునీం పశ్యతాం దివం జగామ ||

తా|| ఆ ముని ( విశ్వామిత్రుడు) చెప్పిన వెంటనే ఆ నరేశ్వరుడు మునులు చూచుచుండగనే దేవలోకమునకు పోయెను.

దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుం పాకశాసనః |
సహ సర్వైస్సురగణైః ఇదం వచనమబ్రవీత్ ||

స|| పాకశాసనః సర్వైః సురగణైః సహ దేవలోకగతం త్రిశంకుం దృష్ట్వా ఇదం అబ్రవీత్ ||

తా|| దేవలోకములో త్రిశంకుని చూచి ఆ దేవతలందరి తో కూడిన ఆ ఇంద్రుడు ఇట్లు పలికెను.

త్రిశంకో గచ్చ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః |
గురుశాపహతో మూఢ పత భూమిమివాక్చిరాః ||

స|| హే త్రిశంకో ! త్వం భూయః గచ్ఛ | హే మూఢ గురుశాపహతః స్వర్గకృతాలయః న అసి | భూమిం పత ఇవాక్చిరాః ||

తా|| ఓ త్రిశంకు ! నీవు మరల వెనక్కి పొమ్ము. ఓ మూఢా గురుశాపము పొందిన నీవు స్వర్గము పొందుటకు అనర్హుడవు |

ఏవముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్ పునః |
విక్రోశమానః త్రాహీతి విశ్వామిత్రం తపోధనమ్ ||

స|| మహేంద్రేణ ఏవం ఉక్తః తపోధనమ్ విశ్వామిత్రం త్రాహీ ఇతి విక్రోశమానః త్రిశంకుః పునః అపతత్ ||

తా|| మహేంద్రునిచే ఇట్లు చెప్పబడి త్రిశంకువు తపోధనుడైన విశ్వామిత్రుని రక్షింపుము అని అనుచూ మరల (భూమిపై) పడిపోవుచుండెను.

తత్ శ్రుత్వా వచనః తస్య క్రోశమానస్య కౌశికః |
రోషమాహారయత్ తీవ్రం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ||

స|| క్రోశమానస్య తస్య వచనం శ్రుత్వా కౌశికః తీవ్రం రోషమ్ అహారయత్ తిష్ఠ తిష్ఠ ఇతి చ అబ్రవీత్ |

తా|| అలా ఆక్రోశములో నున్న అతని మాటలను విని కౌశికుడు ( దేవతలపై) మిక్కిలి క్రోధముతో " ఆగుము ఆగుము అని పలికెను.

ఋషిమధ్యే స తేజస్వీ ప్రజాపతిరివాపరః |
సృజన్ దక్షిణమార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః ||

స|| స తేజస్వీ అపరః ప్రజాపతిరివ ఋషి మధ్యే దక్షిణ మార్గస్థాన్ అపరః సప్తర్షీన్ పునః సృజన్ ||

తా|| ఆ తేజస్వి ఇంకొక ప్రజాపతి వలె ఋషి ల ముందర దక్షిణ మార్గములో ఇంకొక సప్త ఋషుల మండలమును ను సృష్ఠించెను.

నక్షత్ర మాలామ్ అపరాం అసృజత్ క్రోథమూర్ఛితః |
దక్షిణాం దిశమాస్థాయ మునిమథ్యే మహయశాః||

స|| మహాయశాః క్రోథ మూర్ఛితః మునిమధ్యే దక్షిణాం దిశం ఆస్థాయ అపరం నక్షత్ర మాలామ్ అసృజత్ ||

తా|| ఆ మహాయశస్సుగల ముని క్రోధముతో మునుల సమక్షములో దక్షిన దిశలో మరియొక నక్షత్ర మండలమును సృష్ఠించెను.

సృష్ఠ్వా నక్షత్ర వంశం చ క్రోధేన కలుషీకృతః |
అన్యమింద్రం కరిష్యామి లోకో వాస్యాదనింద్రకః ||
దైవతాన్యపి స క్రోథాత్ స్రష్ఠుం సముపచక్రమే ||

స|| క్రోధేన కలుషీకృతః (సః మునిః) నక్షత్ర వంశం సృష్ట్వా అన్యమింద్రం కరిష్యామి వా అస్య లోకః అనింద్రికః (భవేత్) | క్రోధాత దైవతాన్ అపి స్రష్టుం సముప చక్రమే ||

తా|| క్రోధములో మునిగిపోయిన ఆముని నక్షత్ర మండలము సృష్టించి ఇంకొక "ఇంద్రుని సృష్టించెదను లేక (స్వర్గమును) ఇంద్రరహితముగా చేసెదను"’ అని తలచి, ఆ క్రోధములో దేవులను కూడా సృష్టించుటకు పూనుకొనెను.

తతః పరమ సంభ్రాంతాః సర్షి సంఘాస్సురాసురాః|
విశ్వామిత్రం మహాత్మానం ఊచు స్సానునయం వచః ||

స|| సురాః అసురాః స ఋషి సంఘాః సంభ్రాంతాః మహాత్మానం విశ్వామిత్రం స అనునయం వాక్యం ఊచుః ||

తా|| సురాసురులు ఋషి సంఘములతో కూడి మహాత్ముడైన విశ్వామిత్రునితో అనునయ వాక్యములతో ఇట్లనిరి||

అయం రాజా మహాభాగ గురుశాప పరిక్షతః |
సశరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధన ||

స|| హే మహాభాగా! అయం రాజా గురుశాప పరిక్షతః | హే తపోధన ! సశరీరో దివం యాతుం అ అర్హతి ఏవ ||

తా|| "ఓ మహాభాగా ! అ రాజు గురుశాపము పొందెను. ఓ తపోధనా ! శరీరముతో దేవలోకమునకు వచ్చుటకు అనర్హుడు."

తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుంగవః |
అబ్రవీత్ సుమహద్వాక్యం కౌశిక స్సర్వ దేవతాః ||

స|| సర్వదేవతాః తేషామ్ తత్ వచనం శ్రుత్వా దేవానామ్ మునిపుంగవః కౌశిక సుమహత్ వాక్యం అబ్రవీత్ ||

తా|| ఆ దేవతలు అందరి వచనములను విని ఆ మునిపుంగవుడుగు కౌశికుడు ఒక ముఖ్య విషయము ప్రస్తావించెను.

సశరీరస్య భద్రం వః త్రిశంకోరస్య భూపతేః|
అరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే ||

స|| భద్రం వః | అస్య భూపతేః త్రిశంకోః స శరీరస్య ( స్వర్గం) ఆరోహణం ప్రతిజ్ఞాయ అనృతం కర్తుం న ఉత్సహే ||
తా|| "మీకు శుభమగుగాక . ఈ భూపతి యగు త్రిశంకుని శరీరముతో దేవలోకము పంపుటకు ప్రతిజ్ఞపూని ఆ మాటను అసత్యముచేయుటకు నాకు ఇష్టములేదు".

సర్గో అస్తు సశరీరస్య త్రిశంకోరస్య శాశ్వతః |
నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణ్యథ ||

స|| స శరీరస్య త్రిశంకోః సర్గః అథ శాశ్వతః అస్తు మామకాని సర్వాణి నక్షత్రాణి ధృవాణి చ||

తా|| ( త్రిశంకుని) శరీరముతో కూడిన స్వర్గము ఇప్పుడు శాశ్వతము అగును. నాచే సృజింపబడిన నక్షత్ర మండలములు కూడా ధృవముగా నుండును.

యావల్లోకా ధరిష్యంతి తిష్టంత్వేతాని సర్వశః |
మత్కృతాని సురాస్సర్వే తదనుజ్ఞాతు మర్హథ ||

స|| యావత్ లోకాః ధరిష్యంతి ( తావత్) మత్కృతాని ఏతాని సర్వశః తిష్ఠంతి | సర్వే సురాః తత్ అనుజ్ఞాతు మర్హతి ||

తా|| ఈ లోకములనీ ఉన్నంతకాలము నాచే చేయబడిన వన్ని నిలిచియుండును. దేవతలందరూ దానికి అనుమతి ఇచ్చుదురు గాక ||

ఏవముక్తాస్సురాః సర్వే ప్రతూచుర్మునిపుంగవమ్ |
ఏవం భవతు భద్రం తే తిష్ఠంత్యేతాని సర్వశః ||

స|| సర్వే సురాః ఏవం ఉక్తా , (తం) మునిపుంగవం ప్రత్యూచుః | భద్రం తే ఏవం భవతు ఏతాని సర్వశః తిష్టంతి ||

తా|| ఇట్లు చెప్పబడిన దేవతలు అందరూ ఆ మునిపుంగవునితీ ఇట్లనిరి. " నీకు శుభము అగు గాక. అట్లే అగును. సృజించినవి అట్లే నుండును.

గగనే తాన్యనేకాని వైశ్వానరపథాత్ బహిః |
నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్షు జాజ్వలన్ ||

స|| మునిశ్రేష్ఠ గగనే తాన్ అనేకాని నక్షత్రాణి తేషు జ్యోతిషు వైశ్వానర పథాత్ బహిః జాజ్వలన్ ||

తా|| ఓ ముని శ్రేష్ఠ ! గగనములో అనేక నక్షత్రములు వుండును వానిలో (నీచే సృజింపబడినవి) జ్యోతిష్చక్రమునకు బయట ప్రకాశించు చుండును.

అవాక్ఛిరాస్త్రిశంకుశ్చ తిష్ఠత్వమరసన్నిభః ||
అనుయాస్యంతి చైతాని జ్యోతీంషి నృప సత్తమమ్ |
కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోకగతం యథా ||

స|| త్రిశంకుశ్చ అమరసన్నిభః అవాక్చిరాః తిష్ఠత్వం | ఏతాని జ్యోతీంషి కృతార్థం కీర్తిమంతమ్ నృపసత్తమం అనుయాస్యంతి యథా సర్వలోకగతం చ||

తా|| త్రిశంకుడు అమరుడై అపచారఫలితముగా అధోముఖుడై ఉండును. ఆ ( సృజింపబడిన) నక్షత్రములన్నియూ కృతర్థుడు కీర్తిమంతుడు అయిన నృపసత్తముని అనుసరించును.

విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదైవైరభిష్టుతః |
ఋషిభిశ్చ మహాతేజా భాఢమిత్యాహ దేవతాః ||

స|| సర్వదైవైః ధర్మాత్మా విశ్వామిత్రస్తు అభిష్టుతః | మహాతేజా ఋషిభిశ్చ దేవతాః బాఢం ఇతి ఆహ |

తా|| అప్పుడు అందరు దేవతలచే విశ్వామిత్రుడు ప్రస్తుతించిరి. మహాతేజోవంతుడు దేవతలతో " శుభము" అని పలికెను.

తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః |
జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాంటే నరోత్తమ ||

స|| హే నరోత్తమ ! తతః యజ్ఞస్య అంతే మహాత్మానః దేవాః తపోధనాః మునయః చ జగ్ముః యథాగతం||

తా|| 'ఓ రామా ! అప్పుడు యజ్ఞము సమాప్తము అవగా దేవతలు మహాత్ములు తపోధనులు మునులు అందరూ వచ్చిన విథముగనే వెళ్ళిపోయిరి'.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్టితమస్సర్గః ||

|| ఈ విథముగా శ్రీమద్రామాయణములో ని బాలకాండలో అరువదియవ సర్గము సమాప్తము||

|| om tat sat ||